టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానని ప్రకటించారు ఏపీ మంత్రి జోగి రమేష్. సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడ బరిలోకి దిగుతానని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. “పార్టీ నాయకుడు తీసుకునే నిర్ణయానికి ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాలి. నాకు పెడన సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు.
మైలవరం లేదా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడకు వెళ్తా. పార్టీ అధికారంలోకి రావడానికి ఈ మార్పులు. జగన్ మళ్ళీ సీఎం కావడం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. పార్టీ నేతలు ఎవరిని ఆయన వదులుకోరు” అని స్పష్టం చేశారు.
కాగా వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతూనే ఉంది. మరికొంత మంది ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్ పిలుపు వచ్చింది.. సీఎం క్యాంప్ కార్యాలయానికి కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీసునకు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, బియ్యపు మధుసూదన రెడ్డి, రెడ్డి శాంతి వచ్చారు. అటు క్యాంప్ ఆఫీసునకు ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చాడు.