ఎన్టీఆర్‌ కొడుకులు..చవటలు, దద్దమ్మలు – జోగి రమేష్‌

ఎన్టీఆర్‌ కొడుకులు..చవటలు, దద్దమ్మలు అని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఫైర్‌ అయ్యారు. బాలయ్య.. వైసీపీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ.. జోగి రమేష్‌ మాట్లాడారు.మీ తండ్రి ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కృష్ణా జిల్లాకు సీఎం జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టారని, ఆయనకు బాలకృష్ణ రుణపడి ఉండాలని తెలిపారు. బాలకృష్ణకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ అయితే, పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అని అన్నారు. గతంలో ఏం జరిగిందో బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలని జోగి రమేశ్ హితవు పలికారు.

సినిమాల్లో ఫైట్లు చేయడం కాదు… నువ్వు ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవాడివే అయితే, నీకు పౌరుషం ఉంటే మీ నాన్న మరణానికి కారకుడైన చంద్రబాబుపై ఫైట్ చేయాలని సవాల్‌ చేశారు. మీ నాన్న పార్టీని, పార్టీ గుర్తును, ట్రస్టును లాగేసుకున్న చంద్రబాబుపై ఫైట్ చేయి… అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. అంతేతప్ప, ఎన్టీఆర్ చనిపోయిన 27 ఏళ్ల తర్వాత వచ్చి గుండెల్లో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, గుండీల్లో ఉన్నాడు అంటే ఎవరూ నమ్మరని చురకలు అంటించారు. పెట్టుడు మీసాలు మెలేస్తూ చెప్పే డైలాగులు సినిమాల వరకే అంటూ ఎద్దేవా చేశారు.