ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో తీర్పు రిజర్వ్

-

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలంటూ మృతుడి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మేరకు సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వారిని సహా నిందితుడిగా చేర్చడం లేదా చార్జిషీట్ లో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు ఎటువంటి వివరాలు లేకుండా చార్జిషీట్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అనంతబాబు భార్య కూడా సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అప్పగించే సమయంలో పక్కనే ఉన్నారని, ఆమె పేరును ఛార్జీ షీట్ లో ఎందుకు చేర్చలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం విచారణను ముగించింది. తీర్పును రిజర్వులో ఉంచింది.

Read more RELATED
Recommended to you

Latest news