కడప YCP కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాధవి రెడ్డి లేని గొడవలు సృష్టిస్తున్నారు అంటూ మీడియా సమావేశంలో కీలక కామెంట్స్ చేసారు. మేయర్ ఇంటి పై ఎమ్మెల్యే కావాలని చెత్త వేసేలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం దారుణం. కడపలో ఎక్కడా చెత్త సేకరణ ఆపలేదు. చేయద్ధని మేయర్ ఎక్కడా చెప్పలేదు. అనవసరంగా కడపలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి లేని గొడవలు సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కడపలో ఎమ్మెల్యే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
కడపలో ఎక్కడైనా చెత్త సేకరణ చేయలేదు అని ప్రజలు ఫిర్యాదు చేశారా.. నిజంగా ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే వైసీపీ కార్పొరేటర్లు మొత్తం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధం అని అన్నారు. అలాగే 2019 ముందు కడపలో ఎక్కడ చూసినా చెత్త వల్ల ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు.. సీఎంగా వైఎస్ జగన్ గెలిచాక క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నామమాత్రపు పన్నులను వసూలు చేశాం. ఎక్కడా చెత్త సేకరణకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సేకరణ జరిపాం. మురికివాడల్లో 40, కమర్షియల్ దుకాణాలకు 90 రూపాయలను సేకరించేలా తీర్మానం చేశాం. చంద్రబాబు సీఎం అయ్యాక చెత్త పన్ను వసూలు చేయద్దు అన్నారు కానీ ఎటువంటి జీవో ఇవ్వలేదు. జీవో విడుదల చేయడం ద్వారా అందరికీ అవగాహన వస్తుంది అని YCP కార్పొరేటర్లు తెలిపారు.