రాష్ట్ర ఎన్నికల్లో ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోంది అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇక సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది, న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ అంశంపై నేను మాట్లాడను. సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం కల్పించేందుకే సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
ఇక చంద్రబాబు సీఎం అవ్వటంతో ఢిల్లీతో పాటు జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోంది అని ఆయన అన్నారు. అదే విధంగా నాయకులకు, ప్రజలకు అనుసంధానం కొనసాగేలా ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ సత్ఫలితాలభిస్తోంది. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేందుకే ప్రజా సమస్యలు స్వయంగా స్వీకరించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి పరీష్కరిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చడం తో పాటు సమస్యలను వీలైనంత త్వరగా పరీష్కరిస్తున్నాం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.