కాకినాడ పోర్ట్ అంశంపై విమర్శలు రాజకీయ లబ్ధి కోసం తప్ప వేరే కాదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే జగన్, సుబ్బారెడ్డి కుమారుడు, విజయ్ సాయిరెడ్డి లపై బురద చల్లారు. కేసులు పెట్టందుకు ఇదంతా చేస్తున్నారు. ఇక సీఐడీకి ఫిర్యాదు చేసిన కేవీ రావు చంద్రబాబు మనిషి. 2019 ఎన్నికల ముందు పవన్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. కేవీ రావుకు కాకినాడ సీ పోర్ట్ ను చంద్రబాబు ఎలా దోచి పెట్టారో పవన్ చెప్పారు. పవన్ ఇప్పుడు ఈ మాట చెప్పక పోవచ్చు. ఎందుకంటే పవన్ నిలకడ లేని మనిషి అని ఆయన విమర్శించారు.
అయితే 1997లో లాభాల్లో ఉన్నప్పుడే చంద్రబాబు సీ పోర్టును కేవీ రావుకు రాసిచ్చారు. ప్రత్యర్థులు ఉండకూడదు అనే లక్ష్యంతో చంద్రబాబు చర్యలు ఉన్నాయి. ప్రశ్నించటం అనేది లేకుండా చంద్రబాబు చేస్తున్నారు. పాత కేసులను బయటకు తీసి ఆ కేసుల్లో ఇరికిస్తున్నారు. కొత్త కేసులను కూడా తయారు చేసి మరీ జైలుకి పంపుతున్నారు అని కాకాని పేర్కొన్నారు.