ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు. ప్రతిసారి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం అలవాటే. విద్యుత్ ఛార్జీలపై ఎప్పుడు నేను చెప్పాను అని ప్రశ్నిస్తున్నారు. పులివెందులలోనే ప్రజల ముందే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు.
కానీ విద్యుత్ చార్జీలపై విలేకరుల సమావేశంలో ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేయగా తాను అలా అనలేదని చెప్పారు. వంద రోజులు పూర్తికాగానే విద్యుత్ పిడుగును ప్రజలపై వేశారు. విద్యుత్ చార్జీలకు సంబంధించి డిస్కమ్ లు ప్రతిపాదనలు చేశాయి. అంటే ఇక ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపడమే తరువాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం యూనిట్ ధర గణనీయంగా పెరగనుంది. దీనివల్ల వినియోగదారులపై రూ.8 వేల 100 కోట్ల మేర అధికంగా భారం పడనుంది. విద్యుత్ చార్జీల పెరుగుదల వల్ల అన్ని విధాలా ప్రజలు ఇబ్బందులు పడతారు అని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.