కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదు. నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు. నిర్వాసితుల కోసం పోరాడిన మాపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదు.
హైదరాబాద్ నాలాల పైన 28 వేల అక్రమ కట్టడాలున్నాయని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆరే చెప్పాడు. మూసీ రివర్ బెడ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు ఇస్తున్నాం. మూసి నిర్వాసితులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎక్కడా అడ్డుకోవడం లేదు అని లక్ష్మణ్ కుమార్ తెలిపారు.