రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది : కాకాణి

-

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కుటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉన్నాయని టీడీపీ అనుకూల పత్రికల్లోనే వార్తలు వచ్చాయి అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ ఇబ్బందులు కూడా వైసిపి ప్రభుత్వం వల్లే అని ప్రచారం చేయడం సరికాదు. ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు అదే విధంగా రైతుల గురించి కూడా ఆలోచించడం లేదు. రైతు భరోసా మొత్తాన్ని కూడా పెంచుతామని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోవడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.

వైసిపి హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే స్పందించాం. జగన్ హయాంలో ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరిగాయి. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన రైతులే చెబుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం కంటే వైసిపి హయాంలో అధికంగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాం. పంటల నష్టానికి సంబంధించి బీమాను టీడీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి లేదా పౌర సరఫరాల శాఖ మంత్రి.. ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు. గతంలో చంద్రబాబు రైతులకు రూ. 960 కోట్ల బకాయిలు పెట్టి వెళితే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారు. రైతులకు సంబంధించి అన్ని విధాలా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కాకాణిఅన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news