షిప్ సీజ్ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు..!

-

గత నెల 29న సీజ్ ద షిప్ అని అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదేశాలపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేసారు. షిప్ సీజ్ చేయడం కుదరదని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు కాకినాడ కలెక్టర్. ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పిన కలెక్టర్.. రేషన్ బియ్యం కిందకి ఆన్ లోడ్ చేసిన తరువాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.

అయితే స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం. ముందు షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యం మొదట ఆన్ లోడ్ చేస్తాము. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం అని కాకినాడ కలెక్టర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version