బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

-

బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ MLAలకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు. కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు అని అన్నారు. అలాగే నిరసనల్లో కూడా తమ దురంకారాన్ని ప్రదర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు అని తెలిపారు.

ఇక టిఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారు. కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు లేవు. కానీ ఇప్పుడు రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటి అని ప్రశ్నించిన ఆమె.. గతంలో వెల్ లోకి వస్తె సభ నుంచి సస్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు అని సీతక్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version