దమ్ముంటే కాకినాడ సిటీ నుంచి పోటీ చేయ్ అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.
కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కి గతంలో సవాల్ విసిరారు..ఈ రోజుకి నేను ఆ సవాల్ కు కట్టుబడి ఉన్నానంటూ మళ్లీ గుర్తు చేశారు. నాపై చేసిన ఆరోపణలపై ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామన్నా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు. గాజు గ్లాసు గుర్తు నా పై బ్యాలెట్ లో పోటీగా పెట్టాలని ఛాలెంజ్ చేశారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తోక ముడిచి వెళ్లిపోతే పవన్ ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పాలి..కాకినాడ లో నాపై పవన్ పోటీ చేస్తారని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశారు.