బీఆర్ఎస్ నేతలపై కేసులు ఇప్పట్లో లేనట్లేనా….!

-

పదేళ్ల నిరీక్షణ తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి… అక్రమార్కుల భరతం పడతామని చాలాసార్లు ప్రకటించారు. ఇదే క్రమంలో అవినీతిని బయట పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ కేసులు, చర్యల విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకున్నట్లు లేదు.పరిపాలన కంటే బీఆర్ఎస్ నేతల అక్రమాలనే ప్రతిరోజు తలచుకుంటున్న కాంగ్రెస్ సర్కారు… చర్యల ఉషయంలో కాస్త నెమ్మదిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదికను లీక్ చేశారు. ఈ అంశం అధికారంగా నేడో రేపో బయటకు రానుంది. బడా నేతలపై కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఇప్ప‌టికే గ‌చ్చిబౌలి పోలీస్టేష‌న్‌లో మాజీమంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు పీఎస్‌గా వ్య‌వ‌హ‌రించిన క‌ల్యాణ్‌పై కేసు న‌మోదైంది. ఈ కేసును అవినీతి నిరోధ‌క శాఖ టేక‌ప్ చేసి విచార‌ణ చేస్తోంది. ముందుగా కార్యాల‌యంలో ఫైళ్ల త‌ర‌లింపుపైన నాంప‌ల్లిలోనూ కేసు న‌మోదైంది. ఇందులో తలసాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఫార్ములా ఈ- రేస్‌కు ఎలాంటి ఆదేశాలు లేకుండా పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌ రూ. 55 కోట్లు ప్రైవేట్ కంపెనీకి ధారాద‌త్తం చేసిన అంశంపై ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానిపై అర‌వింద్ కుమార్ పొంత‌న లేని స‌మాధానం ఇవ్వ‌డంతో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఉప‌క్ర‌మించింది. ఆ రూ.55 కోట్ల తిరిగి చెల్లించాల‌ని ప్ర‌భుత్వం అర‌వింద్ కుమార్‌కు తేల్చి చెప్పింది. తాను కేటీఆర్ చెప్పినట్లే చేశానని ఆయన అంటున్నారు.

ఇక భూ క‌బ్జా కేసులో జ‌న‌గామ‌ ఎమ్మెల్యే ప‌ల్లారాజేశ్వ‌ర్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఇవికాకుండా కాంగ్రెస్ లిస్టులో చాలా అంశాలే క‌నిపిస్తున్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల‌తో పాటు యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్‌పై విచార‌ణకు ఆదేశించాల‌ని ఇప్పటికే కాంగ్రెస్ స‌ర్కారు నిర్ణ‌యించింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం చేయిస్తున్న‌ విచార‌ణ‌ల‌న్నీ బీఆరెస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల వైపే వేలెత్తి చూపిస్తున్నాయ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం తదుప‌రి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించేందుకు సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. ఈ మేర‌కు ఒక‌రిద్ద‌రిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు.అయితే లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలకు ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుందని వెనకడుగు వేస్తోంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాక బీఆర్ఎస్ నేతల సంగతి చూడొచ్చని అప్పటివరకు కాస్త నెమ్మదిగా ఉంటే మంచిదని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news