భారత్-న్యూజిలాండ్ మహిళల క్రికెట్ లో మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మూడో వన్డేలో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. ముఖ్యంగా ఆ జట్టు 49.5 ఓవర్లు ఆడి 232 పరుగులను సాధించింది. బ్లాక్ క్యాప్స్ లో బ్రూక్ హాలీడే(86) అర్థ సెంచరీతో ఆదుకున్నారు. అలాగే ప్లిమ్మర్ (39), గేజ్ (25) రాణించారు.
ఇక భారత మహిళల జట్టు బౌలర్లలో దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, రేణుక, సైమా ఠాకూర్ లు చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ భారత మహిళల జట్టు గెలవాలంటే.. 233 పరుగులు సాధించాలి. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఛేదిస్తుందో.. మరీ తడపడుతుందో వేచి చూడాలి మరీ.