ఆ మరణాలకు MLA శ్రీనివాసరావు బాధ్యత వహించాలి : కాసు మహేష్ రెడ్డి

-

దాచేపల్లి పట్టణంలో డయేరియా తో మృతి చెందడం బాధాకరం. ఇద్దరు వ్యక్తులకు సరైన మంచినీరు అందకనే మృతి చెందారు. ఈ మరణాలకు గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలి అని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్నారు. అలాగే మృతి చెందిన వారికి ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కృష్ణానది నుంచి శుద్ధి చేసిన కృష్ణ జలాలను అందజేశాం. ఈ ప్రభుత్వం కలుషితమైన మంచినీరు అందించటం వలనే డయేరియా వల్ల ప్రజలు మృతి చెందుతున్నారు.

ఈ ప్రభుత్వం లో నాయకులు కనీసం స్వచ్ఛమైన మంచినీటిని అందించలేకపోతున్నారు. గతంలో కూడా పిడుగురాళ్ల పట్నంలోని ,లెనిన్ నగర్లో డయేరియా బారి నుండి నలుగురైదుగురు మృతిచెందారు. 50 మంది వరకు హాస్పటల్ పాలై లక్షలు ఖర్చు చేసుకున్నారు. బోర్ల లోని కలుషితమైన నీరు తాగి డయేరియా బారిన ప్రజలు పడుతున్నారు. మొన్న పిడుగురాళ్ల, ఈరోజు దాచేపల్లి లో ప్రజలు మంచినీరు అందక రోగాల బారినపడ్డారు. దాచేపల్లి పట్నంలో చనిపోయిన ఇద్దరు, అదేవిధంగా పిడుగురాళ్ల పట్టణంలో గతంలో మృతి చెందిన వారికి ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అని మహేష్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version