మాజీ మేయర్​పైకి పోలీసు వాహనం.. కాళ్లకు తీవ్ర గాయాలు

-

చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారంటూ మాజీ మేయర్ హేమలత ఆరోపణలు చేశారు. గంజాయి కేసు పేరిట కటారి వర్గీయుడి అరెస్టుకు యత్నం చేస్తున్న నేపథ్యంలో.. . అనుచరులతో కలిసి పోలీసులను అడ్డుకున్నారు హేమలత. దీంతో సీఐ జీపు తగిలి మాజీ మేయర్ హేమలత కాలికి గాయం అయింది.. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సందర్భంగా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా వెనకాడటం లేదు… అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు ఎంతలా వత్తాసు పలుకుతున్నారో ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు. మహిళను పోలీసులు జీపుతో తొక్కించారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? బాధితులపైనే తిరిగి కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం దుర్మార్గమని ఆగ్రహించారు.

వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారని… పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి టీడీపీని బెదిరించాలనుకోవడం సరికాదని వెల్లడించారు. ఘటనపై పోలీసు శాఖ స్పందించాలి… రూల్స్ కు వ్యతిరేకింగా వెళ్లినవారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తు పెట్టుకోండని వార్నింగ్‌ ఇచ్చారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news