BREAKING: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఈ పదవ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ…bse.ap.gov.in లో ప్రతీ విద్యార్ధి ఫలితాలు చూసుకోవచ్చు అన్నారు. 6,16,615 మంది పరీక్షలు రాసారు..11,645 స్కూళ్ళ నుంచీ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఉన్నారని వివరించారు.
పదవ తరగతి పరీక్ష ఫలితం ఒక ప్రామాణికమని… కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ జరగకూడదని 6 నెలల పాటు పని చేసి పరీక్షలు నిర్వహించామన్నారు. 45 వేల మంది సిబ్బంది ఈ పరీక్ష నిర్వహణలో ఉన్నారు… 20 వేల మంది వేల్యుయేషన్ లో ఉన్నారని స్పష్టం చేశారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. Bse.ap.gov.in వెబ్ సైట్ తో పాటు manabadi.com లో కూడా పరీక్ష ఫలితాలను పొందవచ్చు.