నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి బయట పెడతానని కేశినేని నానిని హెచ్చరించారు కేశినేని చిన్ని. అక్రమ ఆస్తులు, కేసులు పై కేశినేని నానికి సవాల్ విసిరిన కేశినేని శివనాథ్ చిన్ని…నీ అక్రమాలు నేను నిరూపిస్తా… దమ్ముంటే నా పై చేసిన ఆరోపణలు నిరూపించు అని సవాల్ చేశారు. నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తు లో ఏం చేయబోతున్నాం,
kesineni chinny slams nani
గతంలో ఏం చేశామో మేము చెబుతున్నామని…కేశినేని నాని మాత్రం మా పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. కలల రాజధాని అమరావతి ని వైసిపి ప్రభుత్వం నాశనం చేసింది… ప్రజల ఆర్ధిక వనరులు దెబ్బ తీసి పొట్ట కొట్టారని ఆగ్రహించారు కేశినేని శివనాథ్ చిన్ని. కేశినేని నాని పదేళ్లల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పలేరా ? నా మీద నిందలు వేస్తూ… ప్రజా సమస్యలు గా చిత్రీకరిస్తావా ? అని నిలదీశారు. అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు కేశినేని శివనాథ్ చిన్ని. కరోనా సమయంలో అడ్రెస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్లిపోయావు అంటూ ఫైర్ అయ్యారు.