నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్‌ను అనుమతి లేకుండా ఆర్టీసీ స్థలంలో నిర్మించారని… దానిని మూసివేపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాల్ జీఎస్టీ చెల్లింపులు అన్ని సక్రమంగానే చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తక్షణమే తన సిబ్బందిని జీవన్ మాల్‌కు పంపించడం… పోలీసులతో దాడి చేయించడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విజయావకాశాలు దెబ్బ తీసేలా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ ఫిర్యాదుపై ఇంకా ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది.