లోకేష్ పాదయాత్రపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌మై ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై క‌క్ష‌తో, ప‌గ‌తో విమ‌ర్శ‌లు చేస్తూ పాద‌యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు ఏం చేశామో చెప్పే ధైర్యం టిడిపికి లేదన్నారు.

వైసిపికి ఇచ్చిన ఒక్క అవ‌కాశంతో ఏమేమి చేశామో చెబుతున్నాం అని.. అందుకే మంచి జ‌రిగిందనే మ‌ళ్ళీ మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కోరుతున్నాం అన్నారు. ఆ ధైర్యం టిడిపీకి లేక‌నే ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్రరావు సెట్ చేసిన మనుషుల‌తో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్వ‌లు చేస్తున్న లోకేష్ పాద‌యాత్ర‌లో జ‌రుగుతున్న‌దేమిటో అందరూ చూడాలన్నారు.

వాళ్లే పాద‌యాత్ర‌లో ఉంటారు, వారే అంగ‌ళ్ల‌లో ఉంటారు.. ఇదంతా డ్రామా అని మండిపడ్డారు. కుప్పం స‌భ‌లో అచ్చ‌న్నాయుడు చేసిన వ్యాఖ్య‌లు బాధాక‌రం అన్నారు శ్రీకాంత్ రెడ్డి. 500 మంది పోలీసులు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌లో పాల్గొంటే వారి పట్ల ఆయ‌న వ్యాఖ్యాలు దుర్గార్గం అన్నారు. మాన‌వ‌త్వంతో కూడిన రాజ‌కీయాలు చేయ‌డంలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version