ఖమ్మంలో నా అభ్యర్థులే గెలిచి తీరుతారు – పొంగులేటి

-

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మంలో తన అభ్యర్థులే గెలిచి తీరుతారని స్పష్టం చేశారు. నేడు మధిర నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి.. తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవ్వడి అబ్బ సొమ్ము కాదని.. ప్రజా తీర్పే అంతిమ అని అన్నారు.

 

తాత్కాలికంగా తనని ఇబ్బంది కానీ వచ్చే ఎన్నికలలో శ్రీనన్న అభ్యర్థులు అందరూ గెలిచి తీరుతారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వెనకడుగు వేయనున్నారు పొంగులేటి. తన కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కౌరవులు అంతా ఒకవైపు ఉన్న.. ఈ లక్షలాది గుండెల అండదండతో నేను వస్తున్నానని, మీరు కొట్టుకుపోతారని హెచ్చరించారు.

రుణమాఫీ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు పొంగులేటి. ఎంత చేసాం..? ఇంకా ఎంత చేయాలో చూస్తే ఇప్పటివరకు చేసింది 20% మాత్రమేనని అన్నారు. మనం చేసిన రుణమాఫీ ఎంత అని సీఎం కేసీఆర్ ను అడుగుతున్నానని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షి శ్రీనన్న గూటికి వస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version