ఇండియాలోని పేదరికంపై విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో పేదరికం గత 32 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 1991 వేసవిలో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశంలో సంపద సృష్టికి మాత్రమేగాక దారిద్య్ర నిర్మూలనకు దారితీశాయి. ఇండియాలో 2005–2006 సంవత్సరం 2019–2021 ఏడాది మధ్య దాదాపు 41 కోట్ల 50 లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.
ఇంకా ఈ కాలంలో దారిద్య్రం 55% నుంచి కేవలం 16 శాతానికి తగ్గిపోయిందని కూడా గ్లోబల్ బహువిధ దారిద్య్ర సూచిక–2022 (ఎంపీఐ) గత అక్టోబర్ లో వెల్లడించింది. పేదరికాన్ని ఇలా తగ్గించగలిగినా ప్రపంచంలో అత్యధిక పేద ప్రజలు 2020లో (22 కోట్ల 89 లక్షలు) ఇండియాలోనే ఉన్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ), ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్ దారిద్య్రం, మానవాభివృద్ధి ఇనిషియేటివ్ (ఓఫీ) విడుదల చేపిన ఈ ఎంపీఐ నివేదిక తెలిపింది. పై గణాంక వివరాల్లో కొవిడ్–19 మహమ్మారి ప్రభావం ఎంత ఉందో చెప్పకపోయినప్పటికీ మొత్తంమీద కొవిడ్ రాక ముందున్న 15 ఏళ్లలో ఇండియాలో పేదరికం గణనీయంగా తగ్గిపోవడం ఓ వాస్తవం అన్నారు.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్యను సగానికి తగ్గించాలని 2010లో సమావేశమైన యూఎన్డీపీ, ఓఫీ ప్రతినిధులు నిర్ణయించారు. పదిహేనేళ్లలో దాదాపు 42 కోట్ల మంది దారిద్య్రం నుంచి విముక్తి పొందినా…ఇంకా ఇండియాలో ఇంకా దాదాపు 30 కోట్ల మంది పేదలు ఉంటారని అంచనా. వారిలో 90% (20.5 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రోజుకు సగటున 1.9 డాలర్ల ఆదాయంతో ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని దారిద్య్రం నుంచి బయటపడిన మనిషిగా పరిగణిస్తారు. కేవలం ఆర్థిక పరిస్థితి మాత్రమేగాక చదువు, ఆరోగ్యం వంటి అంశాలను కూడా కలిపి ప్రజలు పేదలా, కాదా అని నిర్ధారించే పద్ధతి ఇప్పుడు అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు విజయశాంతి.