ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు!

-

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏర్పాటైన ఏపీ మంత్రి వర్గం పలు కీర్ణయాలు తీసుకుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాగా.. పేపర్ లెస్ విధానంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

పోలవలం ఎడమ కాలువ పునరుద్ధరణకు సైతం ఆమోదం లభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు పాత విధానంలోనే కాంట్రాక్టర్ పనులను కొనసాగించాల్సి ఉంటుంది.

అబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు సైతం మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పట్టాదారు పాస్ బుక్ లపై ఉన్న మాజీ సీఎం జగన్ ఫోటోలు, రాజకీయ లోగోలను సైతం తొలగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news