అందుకే ఏపీ విభజనను వ్యతిరేకించాను : కిరణ్ కుమార్ రెడ్డి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజనతో ఏపీకి ఇబ్బందులు వచ్చి 9 ఏళ్లు అయింది. ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. నీటికి ఇబ్బందులు వస్తాయనే విభజనను వ్యతిరేకించాను. 9 ఏళ్లు అయినా రాజధానిపై క్లారిటీ లేదు’ అని వాక్యానించారు.

కృష్ణా మిగులు జలాలపై తాను CMగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఏపీ, టిఎస్ లు పట్టించుకోవట్లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలు ఇదే వైఖరితో ఉంటే కేసు ఓడి ఆర్డర్ నోటిఫై అయ్యి తీవ్ర నష్టం తప్పదని తెలిపారు. మిగులు జలాలను 3 రాష్ట్రాలకు పంచేలా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకోగా… కిరణ్ సుప్రీంలో సవాల్ చేశారు. కృష్ణ మిగులు జలాలతో 2 రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాలు సాగు అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news