Kolikipudi Srinivas Rao overaction: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఏ.కొండూరు మండలం కంభంపాడులో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బరితెగించి.. వైసీపీ ఎంపీపీకి చెందిన నిర్మాణాన్ని కూల్చేశారు. ఎంపీపీకి చెందిన బిల్డింగ్ కూల్చేందుకు బుల్డోజర్ తో సహా రోడ్డెక్కి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోని కొంత భాగాన్ని కూల్చేయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.
ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు పోలీసులు. కారుపై నిల్చోని మరి… తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక అటు కాకినాడ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ను అడ్డుకుని బలవంతంగా తీసుకుని పోలీసులు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి పై ఫ్లోర్ కూల్చివేశారు కాకినాడ కార్పొరేషన్ అధికారులు. ఎందుకు కూలుస్తున్నారని వెంటనే ఆపాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి.