Krishna District Collector Couple Dance: రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్‌లో ఇవేం డ్యాన్సులు అంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ తీరుపై ఫైర్ అవుతున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. డ్యూయేట్ సాంగ్స్‌కు స్టెప్పులేశారు కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు. అధికారులకు ఎట్ హోం పేరిట విందు ఇచ్చారు.
ఈ తరునంలోనే… డ్యూయేట్ సాంగ్స్‌కు స్టెప్పులేశారు కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు. ఉదయం దేశ భక్తి.. సాయంత్రం డ్యూయెట్ డ్యాన్స్ చేసి రచ్చ చేశారు. దీంతో కలెక్టర్ దంపతుల డ్యూయెట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిపబ్లిక్ డే వేడుకలలో సినిమా పాటకు స్టెప్పులు వేశారు కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు. ఉదయం దేశ భక్తి సేవలో తరించి.. సాయంత్రం డ్యూయెట్ డ్యాన్స్ చేయడంతో చర్చనీయాంశం అయింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ‘AT HOME’ పేరిట తేనీటి విందు జరిగింది. ఈ వేడుకల్లో స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ దంపతులు.