గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం కృష్ణానదికి 11.80 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అది 12 లక్షల క్యూసెక్కులకు చేరుతుందనే అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ లకు ముప్పు పొంచి ఉంది.
ప్రస్తుతం పెరుగుతున్న వరద దెబ్బకి జిల్లా వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న ఇండ్లను వదిలి వేస్తున్నారు ప్రజలు. పామర్రు లోని లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. అవనిగడ్డ ఉళ్ళిపాలెం వంతెన దగ్గర కట్ట బలహీనం పడటంతో మరమ్మత్తు చర్యలు చేపట్టారు అధికారులు. వరద నీటి ఉదృతి పెరిగితే ముప్పుకు గురవుతమని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఇప్పటికే వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం లేకపోవడంతో వరద ఉధృతి తగ్గుతుందని ఆశాభావంతో ఉన్నారు జిల్లా వాసులు.