అల్లు అర్జున్ అరెస్ట్ నూటికి నూరు శాతం కక్షసాధింపే : కురసాల కన్నబాబు

-

నిన్నటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పై సినీ తరాల నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ తన రియాక్షన్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఈ అరెస్ట్ పై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టు పై రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ చూస్తే భాధనిపించింది. సోషల్ మీడియా చాల బలంగా ఉంది. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.

అలాగే కేంద్రం లో ఉన్న మంత్రులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టారు.. సెలెబ్రెటిని అరెస్ట్ చేస్తే పేరు వస్తుంది అనుకుంటున్నారు. రేవంత్ కు చంద్రబాబు కు మధ్య సంబంధాలే ఉన్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే నిన్నటి నుండి పుష్పా 3 ని చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ నూటికి నూరు శాతం కక్షసాధింపే. ప్రభుత్వం, పోలీసులు వైఫల్యము ఉంది. సెలెబ్రిటీల పట్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది అని కురసాల కన్నబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version