IAS అధికారికి కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ !

-

ఓ IAS అధికారికి కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కనుంది. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఐ ఏ ఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు ఖరారు అయింది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సెర్ప్ సీఈఓగా, సిసిఎల్ ఏ సెక్రటరీ గా , మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ గా ఇంతియాజ్ అహ్మద్ పని చేస్తున్నారు.

Kurnool YCP MLA ticket for IAS officer

ఇంతియాజ్ సొంతూరు కోడుమూరు. ఇక ఇంతియాజ్ ఇవాళ తన ఉద్యోగానికి రాజీనామా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం ఇవాళ సాయంత్రం వైసీపీ లో చేరే అవకాశం ఉంది. ఇంతియాజ్ అహ్మద్ కు వైసీపీ లో ఓ ముఖ్య నేత ఆశీస్సులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కర్నూలు టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కానీ చివరికీ కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఐ ఏ ఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news