BREAKING: కుత్బుల్లాపూర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. రాఘవేంద్ర కాలనీ అనుకోని ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది.

దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ తరుణంలోనే.. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది అగ్నిమాపక సిబ్బంది. ఇక ఈ ప్రమాదంలో నాలుగు షాపులు..పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన లో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.