నేటి నుంచి రాష్ర్టంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

-

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు ఇంటర్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 ఎగ్జామ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించబోమని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా స్పష్టం చేశారు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలు :

  • ఫిబ్రవరి 28 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)
  • మార్చి 4 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)
  • మార్చి 6 – మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1
  • మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1
  • మార్చి 13 – కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1
  • మార్చి 15 – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 18 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీల :

  • ఫిబ్రవరి 29 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)
  • మార్చి 2 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)
  • మార్చి 5 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)
  • మార్చి 7 – మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2
  • మార్చి 12 – ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2
  • మార్చి 14 – కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
  • మార్చి 16 – పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 19 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

Read more RELATED
Recommended to you

Latest news