చింతపల్లిలో విరిగిపడిన కొండచరియలు.. పలువురికి గాయాలు

-

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఆదివారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా ఘోర ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ప్రాంతంలో గిరిజనుల ఇళ్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున మట్టిపెల్లలు, రాళ్లు స్థానికంగా ఉన్న ఇళ్ల మీద పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు ధ్వంసం అవ్వగా పలువురు గల్లంతయ్యారు.

జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులను గ్రామానికి పంపించినట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ వెల్లడించారు.సత్వరమే సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా,సీలేరు ఘాట్ రోడ్‌లోనూ కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news