ప్ర‌కాశం బ్యారేజీకి పోటెత్తిన వ‌ర‌ద.. 70 గేట్ల లిఫ్టింగ్

-

ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడిందని దీంతో రానున్న రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు వివరించారు. అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్ర‌కాశం బ్యారేజీకి మ‌ళ్లీ వ‌ర‌ద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి బ్యారేజీకి 4.50 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తి నీటిని స‌ముద్రంలోకి వ‌దిలారు.

మున్నేరు, పులిచింత‌ల‌, క‌ట్ట‌లేరు నుంచి బ్యారేజీకి భారీ ఎత్తున‌ వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది.దీంతో ప్ర‌స్తుతం బ్యారేజీ నీటిమ‌ట్టం 13 అడుగుల‌ వరకు చేరింద‌ని, ఈ నేప‌థ్యంలోనే మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీ చేసిన‌ట్లు అధికారులు స్పష్టంచేశారు.దీంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది.స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది.లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను వెంటనే పున‌రావాస కేంద్రాల‌కు తరలించారు.బ్యారేజీ ప‌రీవాహ‌క ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముందస్తు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news