లాయర్ దంపతులు వామనరావు ఆయన భార్య హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఇక ఈ వ్యవహారంపై పోలీసులు గట్టిగా ఫోకస్ చేసారు. వాళ్ళను చంపిన కత్తులపై ఆరా తీస్తున్నారు. ఆ కత్తులను వాళ్ళు బ్యారేజ్ లో పడేయడంతో వాటిని తీయడానికి పెద్దపల్లి చేరుకున్నారు గజఈత గాళ్ళు. సుందిళ్ళ బ్యారేజ్ లో వామన్ రావు దంపతుల హత్యకి ఉపయోగించిన కత్తులు, నిందితుల సెల్ ఫోన్లు ఉన్నాయి.
బ్యారేజ్ లో కత్తులు రికవరీ చేయడానికి వైజాగ్ నుంచి గజ ఈత గాళ్లను రప్పించారు. కస్టడీలో ఉన్న కుంట శ్రీను,చిరంజీవి, కుమార్ లను ఎవరి కంట పడకుండా బ్యారేజ్ వద్దకి తీసుకువెళ్లి పోలీసులు విచారించారు. ఆయుధాలు పడవేసిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించాడు కుంట శ్రీను. ఆయుధాలు బ్యారేజ్ లో పడవేసి 10 రోజులవుతుండడం తో అడుగుకి వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయుధాలు వెలికి తీయడం కష్టమేమీ కాదని పోలీసులు అంటున్నారు.