శానిటైజర్లు తాగి మృతి చెందిన ఘటన తరువాత ప్రారంభమైన మద్యం అమ్మకాలు

-

ప్రకాశం జిల్లాలో మద్యానికి బానిసలైన వారు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతుండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దర్శి, కురిచేడులో మద్యం దుకాణాలను మళ్లీ తెరిచారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలు రెడ్​జోన్​లో ఉన్నాయి.

Sanitizer

మత్తు కోసం శానిటైజర్​ తాగి ప్రకాశం జిల్లాలో శనివారం నాటికి 14 మంది మృతి చెందారు. దీంతో మందుబాబుల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని దర్శి, కురిచేడులో మద్యం దుకాణాలను తెరిపించారు. కరోనా ఉద్ధృతి కారణంగా ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు రెడ్​జోన్లలో ఉన్నాయి. లాక్​ డౌన్ నిబంధనల ప్రకారం రెడ్​జోన్లలో మద్యం విక్రయాలు జరపకూడదు. కానీ శానిటైజర్లు తాగి మరే మందుబాబు ప్రాణాలు కోల్పోడకూడదని అధికారులు మద్యం దుకాణాలను తెరిపించారు.

శానిటైజర్ తాగి మందుబాబులు మృతి చెందిన విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీనివల్ల దర్శి, కురిచేడులో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దర్శిలో దాదాపు నెల రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో ఓ వ్యక్తి డబ్బులు చించి మద్యం దుకాణానికి దిష్టి తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news