వైసీపీ ఎంపీకి నారా లోకేష్‌ శుభాకాంక్షలు..

అమరావతి : వైసీపీ ఎంపీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభా కాంక్షలు చెప్పారు. పదవి, పరపతి కంటే ప్రజలే ముఖ్యం అంటూ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని తనదైన శైలిలో ఎండగడుతున్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

వాస్తవాలు బయట పెడుతున్నారనే కక్షతో సొంత పార్టీ ఎంపి అని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి జగన్ వికృతానందం పొందింది కూడా గతేడాది ఇదే రోజు అంటూ జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు లోకేష్‌.

ఇక అంతకు ముందుకు.. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారు ఇప్పుడు పోలీసుల వంతు వచ్చిందని.. నిజాయితీగా పనిచేసే ఒక పోలీసు అధికారిని కక్ష సాధింపు చర్యలతో బలితీసుకుంది వైసీపీ ప్రభుత్వమని విమర్శలు చేశారు నారా లోకేష్‌. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాల‌కృష్ణ‌ని వెంటాడి వేధించి చంపేశార‌ని అనుమానాలున్నాయి… క‌క్ష సాధింపుల వ‌ల్లే గోపాల‌కృష్ణ మ‌ర‌ణించ‌గా, సాటి పోలీసులే క‌ట్టుక‌థ‌లు అల్లడం విచార‌క‌రమన్నారు. ఎస్ఐ అనుమానాస్ప‌ద మ‌ర‌ణంపై న్యాయ‌విచార‌ణ జ‌ర‌గాలని.. దోషులు ఎవ‌రైనా క‌ఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన గోపాల‌కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.