వైసీపీది దండుపాళ్యం గ్యాంగ్ : నారా లోకేష్‌ ట్వీట్‌

అమరావతి : జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీది దండుపాళ్యం గ్యాంగ్ అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు నారా లోకేష్‌. బి ఫార్మశీ స్టూడెంట్ తేజస్విని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ముమ్మాటికీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ ని తప్పించే ఎత్తుగడేనని.. తమ బిడ్డని రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డిఎస్పీ తేల్చేసిందని విమర్శించారు.

సీఎం కళ్లల్లో ఆనందం కోసమే పోలీసులు వ్యవహరిస్తోన్నట్టు అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సూసైడ్ ఇవాళ రేప్ గా ఎలా మారింది జగన్ గారూ..! ఇది యాగీ చేయడం కాదన్నారు. సిఎం జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని.. దళితుల ఇళ్లను కూడా కూల్చి రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహించారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడెయ్యడానికి ఎమ్మెల్యే, ఆర్డివో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చేయడమా..?అని ప్రశ్నించారు.