రజినీకాంత్ కు జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని హెచ్చరించారు నారా లోకేష్. రజినీకాంత్ గారి మీదకు ఊరకుక్కలను ఉసిగొల్పడానికి కారణం ఏంటో చెప్తావా జగన్? ఆయన ఏమన్నారు? అని నిలదీశారు లోకేష్. ఏపీ సీఎం జగన్ ఒక నేరగాడు అని అనలేదే. జగన్ పరిపాలన అధ్వానం అని అనలేదే.
చంద్రబాబు గారి గురించి తనకు తెలిసింది మాట్లాడితే నీకెందుకు చెమట్లు పట్టాయి? అని ప్రశ్నించారు. నీలో సంస్కారం అన్నది ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పు అని నిలదీశారు లోకేష్.కాగా, యువగళం పాదయాత్ర 86వరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం శివార్లలోని క్యాంప్ సైటు నుంచి ఆరంభించానని… గోనెగండ్లలో పాదయాత్ర 1100 కి.మీ మైలురాయికి చేరుకున్న సందర్భంగా అధికారంలోకి వచ్చాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదివేల మందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి, శిలాఫలకాన్ని ఆవిష్కరించానని లోకేష్ పోస్ట్ పెట్టారు.
ఎమ్మిగనూరు న్యాయవాదులు వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఎమ్మిగనూరు సబ్ స్టేషన్ వద్ద కోసిగికి చెందిన వలసకూలీలతో మాట్లాడాను. కడిమెట్ల శివార్లలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతుల ఆవేదన విన్నాను. బుడగజంగాలు, ముస్లింలు, వికలాంగులు, ఎస్సీలు నన్ను కలిసి వారి సమస్యలు చెప్పకున్నారు. రాళ్లదొడ్డిలో చేనేతలతో సమావేశమై వారి సాధకబాధకాలను తెలుసుకున్నానని హామీ ఇచ్చారు లోకేష్.