ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు.. ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన సీఐడీ సిట్.. రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించింది. ఈ తరుణంలోనే ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించింది. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో మెమో వేసిన సీఐడీ సిట్.. ఓపెన్ కోర్టులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
ఇక అటు విజయవాడ న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించిన సీఐడీ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేష్ పేరు కూడా చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సీఐడీ.