నంద్యాలలోని ఆళ్ల గడ్డలో విషాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలో భూమా అఖిల అనుచరుడు శశి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మద్యం మత్తులో బైకుపై అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టిన ప్రేమ్ కుమార్ అలియాస్ శశి…అక్కడిక్కడే మృతి చెందాడు.

తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు భూమా అఖిల. అనంతరం..శశి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు భూమా అఖిల. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే భూమా అఖిల బాడీగార్డ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.