పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు నాకే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ దీక్షకు దిగారు.. కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం అన్నారు జనసేన నేత పోతిన మహేష్. పశ్చిమ నియోజకవర్గం లో నేను లోకల్… కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం నాయ్యం అని వివరించారు.
గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసాం నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారని వివరించారు. పశ్చిమ నియోజకవర్గం లో కొండా ప్రాంతల అభివృద్ధి కి పాటుపడింది జనసేన పార్టీ అన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గం లో ఆణువణువూ నాకు తెలుసు…జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన వైస్సార్సీపీ తో పోటీ పడలేరన్నారు. ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా.. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉందన్నారు పోతిన మహేష్. నాకు టికెట్టు ఇవ్వకపోతే మీకే నష్టమని హెచ్చరించారు.