గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు ఇచ్చింది యాజమాన్యం. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు ఇచ్చింది యాజమాన్యం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సీసీ కెమెరాల అంశంపై విద్యార్ధుల ఆందోళన వేడెక్కుతోంది. కాలేజీలో సీసీ కెమెరాలు అనేవే లేవంటూ ఎస్పీ చెప్పడం పై విద్యార్థులు సీరియస్ అయ్యారు.
విద్యార్ధులకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు రంగంలోకి దిగాయి. ఎస్పీ పూర్తిగా పరిశీలించలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థులు. న్యాయం చేయాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాలేజీ క్యాంపస్ లో వాతావరణం వేడెక్కింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలోనే.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు ఇచ్చింది యాజమాన్యం.