వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని ఖండించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ, జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10% కూడా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తున్నా.రు ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా… ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా.. ప్రజాస్వామ్యంలో ఉన్నావా డా డిక్టేటర్ షిప్ లో ఉన్నామా. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు.
రెడ్ బుక్కు పట్టుకుని గతం లోకేష్ ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడలేదా. వైయస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారు.. మీపై ఏ కేసులు పెట్టాలి. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుంది. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం . ప్రజల వాయిస్ వినిపిస్తాం. సోషల్ మీడియాపై దాడులు చేయటం.. ప్రజాస్వామ్యానికి విఘాతం. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి ఏ కోర్టులో హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేదు అని మార్గాన్ని భరత్ అన్నారు.