ఏపీలో సరిహద్దు చెక్‌పోస్టులు భారీగా పెంచారు. రానున్న ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటివరకు పోలీస్, అటవీ, ఎన్ఫోర్స్మెంట్, జిఎస్టి, రవాణా శాఖల పరిధిలో 46 చెక్ పోస్టులు ఉండగా, ఆ సంఖ్యను 139కి పెంచారు.
త్వరలోనే మరో 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చెక్ పోస్టులో ఆరుగురు సిబ్బంది, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులకు 12 మంది చొప్పున సిబ్బందిని కేటాయించారు. కాగా, ఇక అటు ఏపీలో ఎన్నిక నిర్వాహనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ముందే 12D వారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని అధికారులు పరిశీలించి ఓట్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విధానాన్ని ఈసీ విజయవంతంగా అమలుచేసింది.