సీఎంగా చంద్రబాబు…ఏపీలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు !

-

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా…ఏపీలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలోనే… కృష్ణా జిల్లాలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి.

Massive traffic restrictions in AP

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపులు

ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు

⏩ విశాఖ పట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను

1 .కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు.

2 . విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించడం జరిగింది.

⏩ చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చు వాహనాలు

1 .ఒంగోలు నుండి రేపల్లె మీదుగా వయ మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మరలించడం జరిగింది.

2 . బుడంపాడు నుండి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లింపు.

⏩️ _విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను_

1 . గామన బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్

2 . భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు

3 . ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.

4 . ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.

5 . హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు

⏩️ హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చు వాహనాలను

1 . నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు

2 . ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.

3 . రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.

4 . విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు

Read more RELATED
Recommended to you

Latest news