విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపచారంపై మంత్రి ఆనం స్పందించారు. ఈ నెల 7 వ తారీఖున కనక దర్గమ్మ వారి ఆలయం లో కొందరు వీడియోగ్రఫీ చేశారు అని చెపుతున్నారని… అంతరాలయం లోని మూలవిరాట్టు ను పూజ చేసే వారు తప్ప ఎవ్వరూ మూల విరాట్టు ను తాకకూడదు, వీడియోగ్రఫీ చేయకూడదని కోరారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
ఒక వ్యక్తి ములా విరాట్టు ను వీడియోగ్రఫీ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారని… దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ను విజయవాడ సిపి కి ఇచ్చామని వెల్లడించారు. వీడియో తీసిన వ్యక్తి పై విచారణ జరిగింది….దీనిపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
దేవాదాయ శాఖ నుండి అధికారులు తో మాట్లాడడం తో పాటు సిఎం వద్ద నుండి ఈ విషయం పై ఆదేశాలు ఇచ్చారు….27 వేల ఆలయాలు వున్నయి అన్నింటికీ భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు. అంతరాలయంలోకి వెళ్లి వీడియోగ్రఫీ చేయడం తాకడం వాళ్లకు కూడా మంచిది కాదు…అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భగవంతుని ఆశీస్సులు కోరండి కానీ ఇలాంటి పనులు చేయకూడదన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.