టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీపై మంత్రి బొత్స కీలక ప్రకటన..!

-

అమరావతి : పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్‌ కావడంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు. ప్రశాంతంగా పరీక్షలు రాయడం పై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు.

పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని… పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేశామని పేర్కొన్నారు.

పరీక్షా పత్రాలు మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్న దుష్ప్రచారాన్ని ఖండించిన మంత్రి… అడ్డంగా దొరికిపోయిన నారాయణ, ఇతర విద్యా సంస్థల గురించి అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడటం లేదు?? అని ఆగ్రహించారు. విద్యార్దులకు సంబంధించిన అంశంలో రాజకీయాలు జొప్పించ వద్దని… సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు పట్టించుకోవద్దని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news