కడపలో విద్యుత్ షాక్ కొట్టి ఓ విద్యార్థి చనిపోయిన ఘటన పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్ అయ్యారు. విద్యుత్ ప్రమాదల వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి గొట్టిపాటి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. విద్యుత్ సిబ్బంది చాల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని సూచించారు మంత్రి. అయితే విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్ లాగడానికి ప్రయత్నించిన తరుణంలోనే విద్యుత్ తీగ కిందపడినట్లు మంత్రికి వివరించారు అధికారులు. అయితే విద్యుత్ తీగలు వేలాడుతున్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి వాటికి మరమత్తులు చేయాలి అని అన్నారు మంత్రి. అలాగే కడప ఘటన బాధ్యుల పై తగు చర్యలు తీసుకోవాలి అని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.