వాలంటీర్లకు మంత్రి నారా లోకేష్ షాక్ ఇచ్చారు. వాలంటీర్లు ఉద్యోగాల్లోనే లేరంటూ ప్రకటన చేశారు. వాలంటీర్లపై జీవోను జగన్ మోహన్ రెడ్డి ఎందుకు రెన్యువల్ చేయలేదు… అందుకే వాళ్ళు ఉద్యోగాలలో లేరని క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. ఎన్నికల అప్పుడు 80 శాతం మందితో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని మండిపడ్డారు. వాళ్ళు ఇప్పుడు లేరు కదా? అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారని మండిపడ్డారు. అది చట్టానికి విరుద్ధమని… ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అటు బెజవాడలో విద్యార్థినులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్…మొన్న మధ్యాహ్న భోజన పథకం ప్రారంభానికి జూనియర్ కాలేజ్ కి వచ్చారు. ఆకతాయిల వల్ల ఇబ్బంది పడుతున్నామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లోకేష్ ను కోరారు విద్యార్థినులు. దీంతో గంటల వ్యవధిలో తన టీం కి చెప్పి కెమెరాలు ఏర్పాటు చేయించారు లోకేష్… ఇప్పటికే 3 కెమెరాలు ఏర్పాటు, మరో 2 మధ్యాహ్నం సమయానికి పూర్తి అయ్యాయి. 5 కెమెరాలను కళాశాల పరిసరాల్లో ఏర్పాటు చేయటంతో విద్యార్ధినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.