పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని ప్రకటించారు ఏపీ మంత్రి నారాయణ. అమరావతిలో ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతల స్వీకరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…. పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. సచివాలయం, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి నారాయణ. ప్రపంచ టాప్-5 రాజధానుల్లో అమరావతి ఉండాలని చంద్రబాబు లక్ష్యమని వివరించారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు ఏపీ మంత్రి నారాయణ. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం….కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.